మేర కులస్తులను కించపరిచే వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి

– మేర కులస్తుల జేఏసీ డిమాండ్..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
మేర కులస్తులను కించపరిచే వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ మేర కులస్తులకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ మేర సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) చైర్మన్ మునిగాల రాము డిమాండ్ చేశారు. ఆదివారం మేర సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో హనుమాన్ టేకిడిలోని బీసీ సాధికారత భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మంత్రి కేటీఆర్ మేరకులంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనకే తీసుకొని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మునిగాల రాము మాట్లాడుతూ..ఇటీవల వరంగల్ లో జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మేరకులం సూది పోతే చక్కర పంచాయతీ అని దేవుని మొక్కి దేవుని మోసం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పడం పట్ల మేర కులస్తులను అవమానించే తీరుగా కేటీఆర్ మాట్లాడాలని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి కేటీఆర్ మేరె కులానికి క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న పది లక్షల మంది మేరె కులస్తుల మందరం కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పై న్యాయపరంగా పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు వివిధ రూపాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలందరికి ఈ సమస్య అని చెప్పి ఒక తాటిపై తీసుకువచ్చి పోరాటం చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మేర కులస్తుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సంఘ వెంకట్రాజం. సీ విష్ణు. వెన్ను లింబాద్రి. ఫోల్కమ్ శ్రీనివాస్. గంగాపురం మహేష్. డికొండ సుబ్రహ్మణ్యం. టి లక్ష్మీనారాయణ. శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు

Spread the love