ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాదులో ఘనంగా నిర్వహించిన బోనాలు

– నెత్తిన బోనమెత్తిన ప్రభుత్వ ఆసపత్రి సూపర్డెంట్ డాll. ప్రతిమ రాజ్
నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రతి ఏడాది ఆషాడమాసంలో నిర్వహించే బోనాలను ఈసారి కూడా ఘనంగా నిర్వహించిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాll. ప్రతిమరాజ్ సూపరింటెండెంట్ గారు బోనం ఎత్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లోని బంగారు మైసమ్మ అమ్మవారికి వస్త్రాలు, ఒడి బియ్యం లాంఛనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయకరంగా మన పండుగలను నిర్వహించి మన సంస్కృతిని కాపాడాలని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లోని బంగారు మైసమ్మ అమ్మవారు చాలా శక్తి కలదని, మొక్కిన మొక్కులు తప్పక తీర్చే అమ్మవారు అని ఆమె అన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ఆ దేవత దయవలన ప్రజలందరూ సుఖ సంతోషాల తో ఆయురారోగ్యైశ్వర్యముల తో వర్ధిల్లాలని సూచించారు. అమ్మవారు పూనుకొని చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని, ఎలాంటి కష్టం రాకుండా నేను కాపాడుతానని అమ్మవారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

Spread the love