జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవతే ప్రతాప్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో పత్రికా విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవాతే ప్రతాప్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధికంగా 50% ఉన్నటువంటి బీసీలకు సంక్షేమ పథకాలు అందకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఎన్నికల్లో బీసీలను వాడుకోవడం లాంటి కార్యకలాపాలకు పాల్పడుతుంది. బీసీ అన్ని కులాలకు బీసీ బందును ప్రవేశపెట్టి బీసీ సబ్ ప్లాన్ కు 2000 కోట్ల నిధులను మంజూరు చెయ్యాలి. రాష్ట్రంలోనైనా దేశంలోనైనా అత్యధికంగా టాక్స్లు కట్టేది బీసీలే ఓట్లు మావి సీట్లు మీవా రాబోయే ఎన్నికల్లో రాజ్యాధికార దిశంగా ప్రతి ఒక్క బీసీ ముద్దుబిడ్డ ఐక్యత చాటి బీసీలను గెలిపించుకోవాలి అని బీసీ విద్యార్థి సంఘం ప్రతి బీసీకి కోరుకుంటుంది. ఈ కార్యక్రమంలో నాయకులు గంగోని రమేష్ సంతోష్ వెంకట్ పరమేష్ చిన్న అజయ్ ప్రసాద్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తూంది
నవతెలంగాణ- కంటేశ్వర్