అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు మహిళల అరెస్ట్: ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డి

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయిని మహారాష్ట్రలో కొనుగోలు చేసి నిజామాబాద్ నగరంలో అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ ఎక్సెజ్ ఎస్.హెచ్.వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ ఎక్సెజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని ఆటోనగర్ చెందిన ఫరీదా బేగం, రషీదా బేగం అనే మహిళలు నాందేడ్ జిల్లాలో గంజాయిని రూ.11 వేలకు కొనుగోలు చేసి నిజామాబాద్ కు తరలిస్తుండగా ఇద్దరి అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎక్సెజ్ ఎస్సె మల్లేష్, తోటి ఎక్సైజ్ సిబ్బందిని ఆయన అభినందించారు. సమాచారం రాగానే ఇలాగే ఎక్కడికక్కడ గంజాయిని కట్టుదిట్టం చేయాలని సిబ్బందికి సూచించారు. ఎక్కడ అనుమానం ఉన్న ఉన్న అధికారులకు సమాచారం అందించి గంజాయి నిర్మూలనకు దాడులు నిర్వహించాలని పలు సూచనలను ఈ సందర్భంగా తెలిపారు. గంజాయి క్రయ, విక్రయాల గురించి ఎవరికైనా తెలిస్తే ఎక్సెజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

Spread the love