నవతెలంగాణ కంటేశ్వర్
కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా శనివారం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు తహర్బిన్ హంధాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి కి జిల్లాకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని, విద్య వైద్య సాగునీటి రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గుత్పా అల్లి సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ గాని, చౌట్పల్లి హనుమంత్ రెడ్డి ఇరిగేషన్ గాని, తెలంగాణ యూనివర్సిటీ గాని, ప్రభుత్వ వైద్య కళాశాల గాని నిర్మించిన వ్యక్తి అని ఆయన అన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషి ఆని, ఆయన చేసిన ప్రతి పని ప్రజల అభివృద్ధి కొరకే అని, రాజశేఖర్ రెడ్డి గారు మరణించి 14 సంవత్సరాలు గడుస్తున్న ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ రాజశేఖర్ రెడ్డి పేరును మరువలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతమున్న ప్రభుత్వాలు తమ స్వార్థం కొరకు ఓట్ల కొరకు పెన్షన్, షాదీ ముబారక్ ను, కల్యాణ లక్ష్మిని వాడుకుంటున్నారని కానీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల ఇబ్బందులను చూసి వారికి బాసటగా నిలవాలని దేశంలోనే తొలిసారిగా 200 రూపాయల పెన్షన్ను ఇచ్చారని ,అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యంతో కార్పొరేట్ హాస్పిటలకు వెళితే అక్కడ వైద్యం పేరుతో లక్షలు దోచుకుంటున్న సందర్భంలో పేద ప్రజలు ఇబ్బందులు పడుతూ వారి పుస్తె మట్టేలమ్మి కడుతుంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ లో పేద ప్రజల వైద్యం కొరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందించి రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే చెల్లించే విధంగా గొప్ప పథకాన్ని తీసుకువచ్చారని ఆయన అన్నారు. అదేవిధంగా మహిళలకు డాక్టర్ గ్రూపులలో పావుల వడ్డీకి 10 లక్షల వరకు రుణాలు ఇచ్చి తిరిగి చెల్లించిన తర్వాత వారు చెల్లించిన వడ్డీని తిరిగి వారికే ఇచ్చి మహిళల అభ్యున్నతికి తోడ్పడ్డ వ్యక్తి అని, ఇప్పుడున్న ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న మహిళలు చెల్లించిన రుణాల వడ్డీని తిరిగి ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.2014లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటగా రైతులకు ఉచిత విద్య అందించారని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, పేదలకు ఉచిత అంబులెన్స్ ,రెండు రూపాయలకే కిలో రేషన్ బియ్యం లాంటి ఎన్నో పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందిచరని ఆయన అన్నారు.ఈ సందర్భంగా తాహేర్ బీన్ హంధాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాయంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ,ఒకానొక సందర్భంలో నిజం సాగర్లో ఆయన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న సందర్భంలో రాజశేఖర్ రెడ్డి 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలోని ఎక్కడలేని విధంగా కొత్త పథకాలను రాష్ట్రంలో అమలు చేశారని ,ఆరోగ్యశ్రీ గాని, ఉచిత అంబులెన్స్ గాని ,మహిళలకు రుణాలు గాని ,ఇందిరమ్మ ఇల్లు గాని, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఎన్నో గొప్ప పథకాలు తీసుకువచ్చిన మహనీయుడు అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పాగంగారెడ్డి ,మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ ,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా సేవాదళ్ సంతోష్ ,పీసీసీ డెలికేట్ ఈసా ,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిలు పూల ఉష ,పద్మ, ప్రీతం ,ఆశాబి ,మలైకా బేగం, ఏజాజ్ ,రేవతి ,కైసర్ ,స్వామి గౌడ్ ,శోభన్ ,రఫీ తదితరులు పాల్గొన్నారు.