ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల నిర్వీర్యం అవుతున్న విద్యారంగం

– డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శoతన్
నవతెలంగాణ- కంటేశ్వర్
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యారంగం నిర్వీర్యం అవుతుందని,గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాల వల్ల విద్య వ్యవస్థ నిర్వీర్యం అయిందని డెమొక్రటిక్ పీజా ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంతన్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని  ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంతన్ మాట్లాడుతూ..  విద్యారంగ నాణ్యత విషయంలో 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం 2021- 2022 సంవత్సరంలో ఆరు ప్రమాణికాల ఆధారంగానిర్వహించిన సర్వేలో అట్టడుగున 31వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మనకంటే మెరుగైన విద్యను అందిస్తోందని ఆ రాష్ట్రానికి16 వ స్థానం తగ్గిందని, దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలో విద్యారంగం ఎందుకు వెనుకబాటుకు గురైందో దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని శంతన్ డిమాండ్ చేశారు . పాఠశాల విద్యతో పాటు యూనివర్సిటీ స్థాయి విద్య వరకు విద్య రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తెలంగాణ ఏర్పాటు నుంచి పదవి విరమణ పొందినవారి స్థానంలో నియామకాలు చేపట్టకపోవడం కారణంగా యూనివర్సిటీలలో సైతం బోధనకు తీవ్ర ఆటంకం కలుగుతోందని తొమ్మిదేళ్లుగా విద్యా రంగ పట్టిష్టతకు ఉపాధ్యాయ సంఘాలతో గాని విద్యారంగ నిపునులతోగాని సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించకపోవడం పటిష్టతకు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని, పాఠశాల విద్యారంగంలో 8 ఏళ్లుగా పదోన్నతులు జరుపకపోవడం, ఐదేళ్లుగా బదిలీలు నిర్వహించకపోవడం, తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం కారణంగా ఈరోజు సుమారు 25వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇట్టి ఖాలీలను తక్షణమే భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని, ప్రతి ఉన్నత పాఠశాలలలో సగటున మూడు సబ్జెక్టు టీచర్ల కొరతను దృష్టిలో ఉంచుకొని రెండేళ్ల క్రితం రద్దు చేయబడిన విద్యా వాలంటరీ వ్యవస్థను పునరుద్ధరించి సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చాలని తద్వారా రాజ్యాంగ ప్రకటిత లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల పిల్లలకు ఉచితమైన, నాణ్యమైన విద్యను అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శoతన్ డిమాండ్ చేశారు. అదే మాదిరిగా సర్వీస్ పర్సన్స్ నియామకం లేకపోవడం కారణంగా పాఠశాలలలో పరిశుభ్రత పడకేసిందని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలలో మరుగుదొడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉందని మరుగుదొడ్లలో అడుగుపెట్టలేని స్థితి నెలకొందని తక్షణమే అన్ని పాఠశాలలో సర్వీస్ పర్సన్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేడు జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు యం. బాలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు రాందాస్, అరుణ్ కుమార్, ఒమజి పాల్గొన్నారు.

Spread the love