లిబర్టీ పాఠశాల అడ్మిషన్లు నిర్వహిస్తున్న దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

– ఏ ఐ పి ఎస్ యు, ఎన్ ఎస్ యు ఐ నాయకుల డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామబాద్ నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో గల నారాయణ పాఠశాలలో లిబర్టీ పేరుతో ఒక రూములో కూర్చుని కరపత్రాలు పంచుతూ, అడ్మిషన్లకు పాల్పడుతున్నారు ఈ విషయం తెలుసుకొని మంగళవారం ఏఐపీఎస్యు, ఎన్ఎస్యూఐ, ( AIPSU,NSUI )విద్యార్థి సంఘాలుగా పాఠశాలకు వెళ్లి ఒకే భవనంలో రెండు పాఠశాలలు ఎలా అడ్మిషన్లకు పాల్పడుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే విద్యాశాఖ అధికారులు స్పందిస్తూస్పందిస్తూ సంబంధిత అధికారులనూ తనిఖీకి పంపించడం జరిగింది. ఈ తనిఖీలో పాఠశాలలో పాఠ్యపుస్తకాలతో పాటు ఒక తాళం వేసి ఉన్నది ఆ గదిలో లిబర్టీ స్కూల్ సంబంధించినటువంటి పూర్తి కరపత్రాలు ప్రచారాలు ఉన్నాయని చెప్పేసి వాళ్లకు తెలపడం జరిగింది తీసుకెళ్లడం జరిగింది… ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐపీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. ఓకే భవనంలో రెండు పాఠశాలల అడ్మిషన్లు ఎలా పాల్పడుతున్నాయని ఈ విషయం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇప్పటి తెలిసిన ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదని ఇలా ఒకే పాఠశాల రెండు భవనంలో అడ్మిషన్లు నడుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి పనులు మళ్లీ పునరావతం కాకుండా తగ్గకుండా నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్సీ, జిల్లా కార్యదర్శి జ్వాలా, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్, తదితరులు పాల్గోన్నారు.

Spread the love