కేజ్రీవాల్‌కు బెయిల్‌ దక్కడం సంతోషించదగ్గ పరిణామం : ఇండియా కూటమి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి స్వాగతించింది. అదేవిధంగా కేజ్రీవాల్‌ రాజకీయ కార్యకలాపాల్లో కూడా పొల్గొనేందుకు కోర్టు అనుమతించడం సంతోషించదగ్గ పరిణామమని, ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌కు పాల్గొనే అవకాశం దక్కిందని కూటమి పేర్కొంది.
తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి కూడా అర్వింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ దక్కడంపై ఆనందం వ్యక్తంచేసింది. ‘అర్వింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు ఆయనకు అవకాశం లభించింది’ అని మమతాబెనర్జి తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఓ పోస్టు పెట్టారు.

Spread the love