వాల్టా చట్టానికి తూట్లు..!

– మండలంలో యదేచ్ఛగా కలప వ్యాపారం
– జాడ లేని అధికారుల తనఖీ
– ఇష్టరాజ్యంగా కలప వ్యాపారులు
ఊట్కూర్‌: మండలంలో అక్రమ కలప వ్యాపారం రవాణా కొనసాగుతోంది. కొంతమంది కలప వ్యాపారస్తులు అక్రమ సంపాదనే ధ్యేయంగా చెట్లను నరికి ఇటుక బట్టీలకు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెట్లను నరికి వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మరోపక్క ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి హరితహారం పేరుతో మొక్కలను పెంచడానికి ప్రతి సంవత్సరం కార్యక్రమం చేపడుతుంటే మరోపక్క కలప వ్యాపారస్తులు మాత్రం అక్రమంగా పెద్ద పెద్ద చెట్లను నరికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి మండలంలో నెలకొన్నది. యాప, తుమ్మ , చింత తదితర చెట్లను నరికి ఇటుక బట్టీ లకు లేదా కట్టెల మిషన్‌లకు తరలిస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లను అక్రమంగా నరికి వేస్తున్న వ్యాపారస్తులను అధికారులు గుర్తించి శాఖ పారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. కలప అక్రమ రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోక పోవడంతో వారి వ్యాపారం జోరుగా కొనసాగిస్తున్నట్లు విమర్శలు లేకపో లేదు. మండలంలో వాల్టా చట్టం అమలు కావటం లేదని, దీంతో ఇష్టారాజ్యంగా చెట్లను వ్యాపా రస్తులు నరికి వేస్తు న్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా చెట్లను నరికి వేస్తున్న వారిపై చట్టపరంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు పేర్కొంటున్నారు.
వక్షాలకు రక్షణ కరువు..
మండలంలో వక్షాలకు రక్షణ కరువైందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు . మండలంలోని పులిమామిడి, బిజ్వర్‌ గ్రామాల మధ్య ఇటీవల వక్షాలను వ్యాపారస్తులు నరికి అక్రమంగా కలప తరలిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.చెట్లను నరికి ఇటుక బట్టీలకు ఎక్కువ మొత్తంలో సరఫరా అవుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. జక్లేర్‌ , మక్తల్‌ ప్రాంతంలో చాలా ఇటుక బట్టీలు ఎక్కువ శాతంలో ఉన్నాయని, ఇటుకను కాల్చడానికి ఎక్కువ శాతం కట్టెలను వినియోగించుకుంటారని, ఇటుక బట్టీలు ఎక్కువగా కావటంతో చెట్లను నరికి సరఫరా చేస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ఇటుక బట్టీల వారికి ఇటుకలు కాల్చడానికి కట్టెలు ఎక్కడి నుండి వస్తున్నాయని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు . ఇలాగే చెట్లను నరికే పరంపర కొనసాగిస్తే రాబోయే రోజుల్లో చెట్లు కనుమరుగయ్యే పరిస్థితి లేకపోలేదని మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇంత జరుగుతున్న ఫారెస్ట్‌ అధికారులు మండలంలో నిఘా ఉంచి అక్రమంగా చెట్లను నరకి వేస్తున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటే కొంతమేరకు చెట్లను రక్షించే వారవుతారని ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటికైనా అధికారులు వాల్టా చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని చెట్లను రక్షించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

చెట్లను నరికి వేస్తున్న వారిపై..చర్యలు తీసుకోవాలి
అక్రమంగా చెట్లను విచ్చలవిడిగా నరికి వేస్తున్నారని అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఫా రస్ట్‌ అధికారులు ఎప్పటికప్పుడు తని ఖీలు నిర్వహించాలి. వాల్టాచట్టాన్ని అధికా రులు పటిష్టంగా అమలు చేయాలి.
– బిజ్వార్‌ మహేష్‌ గౌడ్‌, తెలంగాణ విద్యావంతుల వేదిక
ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయ కార్యకర్త.

Spread the love