బస్‌షెల్టర్‌ లేకా.. ప్రయాణికుల పాట్లు

– గంటల తరబడి నిరీక్షణ
– పట్టించుకోని అధికారులు
– బస్‌షెల్టర్‌ నిర్మించాలని ప్రయాణికుల వేడుకోలు
క్రిష్ణా: బస్‌ షెల్టర్‌ లేక ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నపరిస్థితి నెలకొంది. ఇక్కడ బస్‌ షెల్టర్‌ లేకపోవడంతో ఎండ, వానాకాలంలో ప్రయాణికులు ఆవస్థలు పడుతున్న పరిస్థితి. పై చదువుల కోసం పట్టణాలకి వెళ్లేందుకు ఎండలోనే నిరీక్షిం చాల్సి వస్తోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. కష్ణ మండలంలోని గుడెబల్లూర్‌ గ్రామ థైరోడ్‌ ప్రధాన కూడలి వద్ద రెండు రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారి కావడంతో నలుమూలల ప్రయాణికులు వందల సంఖ్యలో రాకపోకలు కొనసాగిస్తుంటారని పేర్కొన్నారు. నిత్యం ఇక్కడి నుంచే ఇటు కర్ణాటక రాష్ట్రం యాదగిరి, రాయచూర్‌, కల్బురిగి, జిల్లాలకు మక్తల్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రధాన సెంటర్‌గా ఉంది. పైగా విద్యా సంస్థలకు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇక్కడి నుంచి మండల కేంద్రానికి వెళ్లవలసి ఉంది. ఆర్టీసీ బస్సుల కోసం రోడ్డుపైనే నిరీక్షించాల్సి పరిస్థితి దాపురించిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్‌షెల్టర్‌ లేకపోవడంతో బస్సుల కోసం షాపులు, హౌటల్లు, కిరాణాషాపుల ఎదుట ప్రయాణికులు నిల్చోని వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయని, బస్సుల కోసం గంటలకొద్దీ ఎర్రటి ఎండలో రోడ్డుపక్కనే వేచి ఉండాల్సి వస్తోంది. వర్షాకాలం కొద్దిపాటి వర్షం కురిసినా తలదాచుకునేందుకు చోటులేక లగేజీ, పిల్లాపాపలతో తడవాల్సి వస్తోంది. మండలంలోని గుడెబల్లూర్‌ గ్రామ థైరోడ్డు ప్రాంతంలో బస్‌ షెల్టర్‌ నిర్మాణం చేపట్టాలని స్థానికులు ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారి కావడంతో ఇటు కర్ణాటకకు, హైదరాబాద్‌ ప్రాంతం వైపు వెళ్లే ప్రయాణికులు థైరోడ్‌ వద్ద ఉన్న రిక్వెస్ట్‌ స్టాప్‌ నుంచే బస్‌లలో ఎక్కుతుంటారు. రెండు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు రోజూ వందలాది మంది ఎక్కే ఈ స్టాప్‌ వద్ద దిగి వారి ప్రాంతానికి వెళ్తారని, బస్సు షెల్టర్‌ లేకపోవడంతో ఎండకు, వానకు తడుస్తూ అవస్థలు పడుతున్నట్లు ప్రయాణికులు వాపో తున్నారు. స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ స్టాప్‌ వద్ద బస్‌ షెల్టర్‌ నిర్మించాలని, చాలా రోజు లుగా ప్రతిపాదనలు ఉన్నా ఇంతవరకు అది సాధ్యపడలేదని, స్థానిక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతామని పలువురు వాగ్దా నాలు చేసినా అవి కార్యరూపం దాల్చడం లేదని, టై రోడ్డు వద్ద దిగే ప్రయాణికులకు టికెట్‌ ఇవ్వకుండా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్ర శక్తి నగర్‌ టికెట్‌ ఇవ్వడం చాలా దుర్మార్గమని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని తక్షణం బస్‌ షెల్టర్‌ నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రయాణికులు దిగే ప్రాంత టికెట్‌ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love