మాయమాటలు చెప్పి ఆగం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి

– కాంగ్రెస్ పాలనలో తిట్లు, వొట్లు
– నాడు ఓటుకు నోటు నేడు ఓటుకు ఓట్లు.
– మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు.
నవతెలంగాణ -రాయపోల్
నాడు ఓటుకు నోటు అని, నేడు ఓటుకు వొట్లు లాగా కాంగ్రెస్ సర్కారు మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో రోడ్ షో లో ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పథకాలు దేవుడు ఎరుగు, ఉన్న పథకాలు ఆగం చేశారన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన కేసీఆర్ పై ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని, ఇది పద్దతి అని ప్రశ్నించారు.చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించి రాష్ట్రానికి సాగు, తాగునీరు, కరెంటు అందించిన కేసీఆర్ ను అవమానించిన రేవంత్ కు బుద్ది చెప్పాలన్నారు.6 గ్యారంటీల బాండ్ ను బౌన్స్ చేసిన ప్రభుత్వం పై తిరుగుబాటు చేయాలన్నారు.రుణ మాపీ, 6 గ్యారంటీల ను ఆగస్టు 15 లోగా అమలు చేయాలని రేవంత్ కు సవాల్ విసిరితే సమాధానం లేదన్నారు.మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న కరెంటు, నీళ్లు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.నాడు ఓట్లకోసం ప్రమిసరీ నోట్లు వ్రాసి ఇచ్చారని, నేడు ఓట్ల కోసం దేవుళ్ళ మీద ఒట్లు వేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో 2500 కోసం కాంగ్రెస్ వాళ్ళను నిలదీయాలన్నారు. ఋణమాపీ, రైతు భరోసా ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో కరెంటు, నీళ్లు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ అందించారన్నారు.కాంగ్రెస్ కు ఓటు వేయాలంటే వారి అబద్ధాలకు సమర్ధించినట్లే అవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలి అంటే ,వొచ్చిన తెలంగాణను నిలుపు కోవాలి అంటే బీఆర్ఎస్ కు అండగా నిలవాలి.మాయ మాటలు చెప్పే రఘునందన్ కు మరోసారి బుద్ది చెప్పాలన్నారు.ఎడ్లు, రైలుబండి, నిరుద్యోగ భృతి అని మోసం చేసిన రఘునందన్ కు మరోసారి ఓడించాలన్నారు.ప్రజలకు ఏమి చేయని బీజేపీ నాయకులు క్యాలెండర్ లతో తిరుగుతున్నారన్నారు.బీజేపీ మూలంగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచారన్నారు.వడ్లు కొనాలి అంటే బీజేపీ నాయకులు నూకలు బుక్కాలన్న వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి మీ యువతకు అండగా నిలిస్తామన్న వెంకట్రామరెడ్డికి అండగా నిలవాలన్నారు.జాయింట్ కలెక్టర్ గా పనిచేసినప్పుడు అనాధ పిల్లలు వొస్తే వారిని దత్తత తీసుకొని బాగోగులు చూసుకున్నాడని గుర్తు చేశారు.
గులాబీకి జై కొట్టిన రాయపోల్… మోసగాళ్లకు బుద్ది చెప్పాలి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నాడు కేసీఆర్ చొరవతోనే రాయపోల్ మండలం ఏర్పడిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.కరువు కటకాలకు నిలయమైన రాయపోల్ మండలంలో గోదావరి జలాలు పారించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. నాడు ఎడ్లు, నాగలి, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన మోసగాడు రఘునందన్ కు బుద్ది చెప్పారన్నారు.జూటా పార్టీకి మరోసారి బుద్ది చెప్పాలన్నారు.కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామరెడ్డికి ఘన విజయం అందించాలన్నారు.ఎంపీని గెలిపిస్తే హరీషన్నతో కలిసి ముగ్గురు అభివృద్ధిలో పోరాటం చేస్తామన్నారు.రాయపోల్ గడ్డ గులాబీ అడ్డాని, భారీ మెజారిటీ అంధించాలని కోరారు.
 తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదు రఘునందన్.. ఆశీర్వదించాలి అండగా ఉంటా. 
ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి. వెంకట్రామరెడ్డి.
ఓటమిని జీర్ణించుకోలేక తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న రఘునందన్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఎంపీ అభ్యర్థి పి. వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు.నాపై అక్కసుతో పిర్యాదు చేస్తున్నారని, నా జీవితం తెల్ల కాగితమని పేర్కొన్నారు.11 ఏళ్లుగా మీతో కలిసి పనిచేశానని, నేడు ఒక కలెక్టర్ ను ఎంపీగా ఎన్నికయ్యే అవకాశం నాకు కల్పించాలన్నారు. నాకు కలెక్టర్ గా క్యాతి ఇచ్చిన మీరు ఎంపీగా సేవ చేసుకొనే భాగ్యం కల్పించాలన్నారు. ఎడ్లు, నాగలి, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన వారికి బుద్ది చెప్పారన్నారు.మోసం చేసిన వ్యక్తి నేడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడని ఆయన ప్రశ్నించారు.ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి రావడం జరిగిందని, ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.ఎంపీగా గెలిస్తే దుబ్బాకను సిద్దిపేట, గజ్వెల్ తరహాలో అభివృద్ధి చేస్తానన్నారు.రికార్డు చేసుకోండి.మాట తప్పేది లేదని, నిరుద్యోగ యువతీయువకులకు అండగా నిలబడటానికి నెలరోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తామన్నారు.నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి పేదలకు 1 రూపాయికే ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్, జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, కత్తి కార్తీక, వెంకట నర్సింహారెడ్డి, చిందం రాజ్ కుమార్, రాజిరెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, ఇప్ప దయాకర్, మండల కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్, మండల  ఉపాధ్యక్షులు సత్యనారాయణ, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love