నాగారం భాహుజన కాలనీలో వైద్య శిబిరం

నవతెలంగాణ – కంటేశ్వర్
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకున్నట్లయితే ఆ ప్రమాదం నుండి బయటపడచ్చని ప్రముఖ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అన్నారు. నాగారం బహుజన కాలనీలో బుధవారం ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు మల్యాల గోవర్ధన్ పర్యవేక్షణలో క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బీడీ కార్మికులు, ఇంటి పని వారు, రోజువారీ కూలీ పనులకు వెళుతున్న వారు ఆరోగ్యంపై పై అవగాహన లేని కారణంగా చిన్న వయసులోనే మరణాలకు లోనవుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాలలో క్యాన్సర్ పై అవగాహనతో పాటుగా టెస్టులు, వైద్యం, ఉచిత మందుల పంపిణీ చేస్తున్నట్లు ట్రస్టు కోశాధికారి ఈవీఎల్ నారాయణ అన్నారు. మారుమూల ప్రాంతమైన నాగారంలో పేదలు, బహుజనులు, అధిక సంఖ్యలో నివసిస్తున్నారని వీరు నగరానికి దూరంగా వైద్యానికి కూడా దూరమయ్యారని, అలాంటివారికి ఈ వైద్య శిబిరం ఎంతో ఉపయోగపడిందని ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు మల్యాల గోవర్ధన్ అన్నారు. ఈ సిబిరంలో డాక్టర్లు ,వైద్య సిబ్బంది, మహిళా సంఘ నాయకులు సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Spread the love