ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం..

– బేగంబజార్ వార్డ్ వార్డ్ అడ్మిని స్టెటేవ్ ఆఫీసర్ ఏ శ్రీనివాస్ గౌడ్

నవతెలంగాణ సుల్తాన్ బజార్
ప్రజల సమస్యల కు సత్వరమే పరిష్కారానికి కృషి చేస్తున్నామని గోషామహల్ జిహెచ్ఎంసి సర్కిల్ -14 బేగంబజార్ వార్డు వార్డు అడ్మిని స్టెటివ్ ఆఫీసర్ ఏ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం పీల్ ఖాన లోని బేగంబజార్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పౌర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు వారి సమస్యలపై ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో, వార్డ్ ఆఫీస్ లో ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారానికి పారిశుద్ధ్యం, విద్యుత్ టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్, ఇంజనీరింగ్, డ్రైనేజీ. టిఆర్ఎఫ్ బృందాలు, రహదారులు.స్ట్రీట్ లైట్ ఇంజనీరింగ్, ఎంటమాలజీ, యు సి డి. 11 విభాగాలకు సంబంధించిన అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. సాయంత్రం 3 గంటల నుంచి ఐదు గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు.
Spread the love