బిసి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించండి

– అఖిల భారత ఓబీసీ విద్యార్ధి సంఘం
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్రంలోని బిసి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిల భారత ఓబీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షులు జి కిరణ్ కుమార్ డిమాండ్ చేసారు. ఈ మేరకు హైదరాబాద్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు మరియు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారికి ను కలసి వినతిపత్రం అందజేసి బిసి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత ఓబీసీ విద్యార్ధి సంఘం ప్రతినిధి బృందం కిరణ్ కుమార్ తోపాటు సంఘం జాతీయ కార్యదర్శి, కేంద్ర విశ్వవిద్యాలయాల ఇంచార్జి ఎన్. సాయి కిరణ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కురువ వెంకటదాస్, తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పి. శ్రావణ్ కుమార్ లు విజ్ఞప్తి చేసారు. ఈ సందర్బంగా గౌడ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఐఐటీ, ఐఐఏం, ఏఐఐఏంఎస్, ఎన్ఐటి, కేంద్ర విశ్వవిద్యాలయాలు, సంస్థలలో చదువుతున్న బీసీ విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్సుమెంట్ చెల్లించాలని, ప్రతి సంవత్సరం మహాత్మ జ్యోతి రావు ఫూలే విదేశీ విద్య నిధి స్లొట్స్ 2500 లకు పెంచాలని, ప్రతి విసవిద్యాలయాలలో ఫూలే పరిశోధన కేంద్రాలను స్థాపించి పిహెచ్.డి చేస్తున్న బీసీ విద్యార్థులకు స్పెషల్ ఫెలో షిప్ లను అందజేయాలని కోరారు. వీటితోపాటు బీసీ యువతకు నైఫుణ్యా అభివృద్ధి కేంద్రాలను ప్రతి మండలంలో ప్రవేశపెట్టాలని, ఆటస్థలం తోపాటు బీసీ విద్యార్థులకు శాశ్వత హాస్టల్ భవనాలను నిర్మించి, నెలవారీ అలవెన్సు రూ. 2500 అందజేయాలన్నారు. బీసీ పిహెచ్.డి విద్యార్థులకు స్పెషల్ డేటా స్కీమ్స్ తోపాటు ప్రభుత్వం ఉచితంగా లాప్ టాప్ లను అందజేయాలని అలాగే బీసీ యువ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక శిక్షణను ఇచ్చి టి – హబ్ ద్వారా స్టార్ట్ అప్ లను ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేసారు.

Spread the love