ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని మహబూబియా ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం సుధారాణి తెలిపారు. గురువారం గన్ ఫౌండ్రి లోని మహబూబియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. విద్యార్థులు అధిక సంఖ్యలో అడ్మిషన్ లు పొందారని తెలిపారు విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు. యూనిఫాం. బస్ పాస్. పోషకాలు కలిగిన మధ్యాహ్నం భోజనం ఇలాంటి సౌకర్యాలను అందిస్తున్నామన్నారు. డిజిటల్ క్లాసులు అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు లైబ్రరీ, కంప్యూటర్ శిక్షణ తరగతులు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల తో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా బడికి వస్తున్నారని తెలిపారు.
Spread the love