సబితా ఇంద్రారెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు..

– బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి
నవతెలంగాణ – మీర్ పేట్
మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై వ్యక్తిగత అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి హెచ్చరించారు. కొత్త మనోహర్ రెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం జిల్లెలగూడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరుతూ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఉద్యమకారుల పేరుతో వ్యక్తిగతంగా అనుచిత వాక్యాలు చేయడం సరైనది కాదని హెచ్చరించారు. కొత్త మనోహర్ రెడ్డి ఏనాడు బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయలేదని తెలిపారు. కేవలం తన స్వలాభం కోసం ఇతరులను బ్లాక్ మెయిల్ చేస్తూ భూకబ్జాలకు పాల్పడుతూ పార్టీ పేరుతో పబ్బం గడుపుతున్న వ్యక్తి మనోహర్ రెడ్డి అని ఆరోపించారు. దమ్ము ధైర్యం ఉంటే మహేశ్వరం నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చలు చేయాలని విమర్శలు చేయాలని వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. ఏ రోజు గ్రామస్థాయి వార్డు మెంబర్ నుండి ప్రజల చేత ఎన్నుకోబడని వ్యక్తులు దాదాపు మూడుసార్లు మంత్రులుగా పని చేసిన వారిపై అనుచిత వాక్యాలు చేయడం మంచి పద్ధతి కాదని మార్చుకోవాలని సూచించారు. ఒక మహిళా మంత్రిపై నిరాధారంగా అవినీతి ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. దాదాపు ఆరు సంవత్సరాలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి అనుభవించి నేడు మంత్రి అవమాన పరుస్తున్నారంటూ ఆరోపణలు చేయడం పాండురంగారెడ్డికి తగదన్నారు. ఇప్పటికైనా మంత్రిపై అనుచిత వాక్యాలు చేసినందుకు మంత్రికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరంతరం ప్రజల అభివృద్ధికై పనిచేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ కార్పొరేటర్ సిద్దాల లావణ్య బీరప్ప, కార్పొరేటర్లు గజ్జల రాంచందర్, బొక్క రాజేందర్ రెడ్డి, ఇంద్రావత్ రవి నాయక్, జిల్లెల అరుణ, నాయకులు దీప్ లాల్ చౌహన్, యాదగిరి, విజయ్, ఓం ప్రకాష్, జోజి, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love