తీహార్ జైలులో కవితను కలిసిన ఆర్ఎస్పీ

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కవితను జైలులోనే కలిశారు. అయితే, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళి గురించి వారిని ఆమె అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు. తాజాగా గురువారం ఆమె బెయిల్ పిటిషన్ విచారణను చేపట్టిన ఢిల్లీ హైకోర్టు మే 24కు వాయిదా వేసింది. దీంతో కవిత సీబీఐ కేసులోనూ బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది.

Spread the love