రజకుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

నవతెలంగాణ – సిద్దిపేట
రజకుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనునిత్యం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు భూంపల్లి శ్రీహరి అన్నారు. కులవృత్తి చేసుకునే రజకులకు ఉచిత కరెంటు, లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కులవృత్తిపై బతికే రజకులకు మాత్రమే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులలో దోబీ సేవల టెండర్లు వేసుకునే అవకాశం కల్పించినందుకు జిల్లా కేంద్రంలోని లాల్ కమాన్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని కులాలకు మంచి గుర్తింపు లభించిందన్నారు. రజకుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా లక్ష రూపాయలు నగదు అందించడంతోపాటు, దోబి టెండర్లకు రజకులకు మాత్రమే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love