మహిళల ఆరోగ్యమే కుటుంబానికి రక్ష..

– ఆరోగ్య మహిళా పోస్టర్ ఆవిష్కరణ..
– డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ పద్మజ
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య శాఖ కృషి చేస్తుందని కింగ్ కోఠి క్లస్టర్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ పద్మజ అన్నారు. ఇసామియా బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మహిళల ఆరోగ్యమే కుటుంబానికి రక్ష అన్నారు.మహిళల ఆరోగ్యం కోసం ప్రతి మంగళవారం మహిళ ల కు 8 రకాల వైద్య పరీక్షలు నిర్వహించిఅవసరమైన వారికి ఉచితంగా వైద్యం, మందులు అందిస్తామన్నారు. తమ ఆసుపత్రిలో 50 మంది మహిళలకు వైద్యం అందించి ఉచితంగా మందులు అందించామని మెడికల్ ఆఫీసర్ స్నేహక తెలిపారు.ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది రకాల వైద్య పరీక్షలతో పాటు అవసరమైన వారిని ఆయా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తాం అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య మహిళా పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ స్నేహక. పి హెచ్ ఎన్ విజయమ్మ. స్టాఫ్ నర్స్ ఫ్లోరా, ల్యాబ్ టెక్నీషియన్ సునీల్. ఫార్మసిస్ట్ రాధిక. వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love