మిస్ ఫైర్ కానిస్టేబుల్ మృతి..

నవతెలంగాణ – బంజారా హిల్స్
మింట్ కాంపౌండ్లోని ప్రింటింగ్ ప్రెస్లో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రామయ్య 46, తుపాకిని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయినట్లుగా తెలిపిన అధికారులు,తీవ్ర గాయాల కారణంగా రామయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అనంతరం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు.

Spread the love