పెద్ద షక్కర్గా లో గర్భకోశ వ్యాధుల శిబిరం

– పశువుల దారులు సద్వినియోగం పరుచుకోండి పశు వైద్యులు డాక్టర్ బండి వార్ విజయ్
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న దశాబ్ది ఉత్సవాలు భాగంగా మంగళవారం నాడు మద్నూర్ మండలంలోని పెద్ద షకర్గా గ్రామంలో పశుసంవర్ధక శాఖ పశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గర్వకోశ వ్యాధుల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యులు డాక్టర్ బండి వార్ విజయ్ గ్రామంలో దూడల ప్రదర్శన కృత్రిమ గర్భధారణ గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఇలాంటి శిబిరాలను ప్రతి ఒక్క పశువుల దారులు సద్వినియోగం పరచుకోవాలని కోరారు ఈ శిబిరంలో గ్రామ సర్పంచ్ బాబురావు పటేల్ ఉప సర్పంచ్ అనిల్ గోపాలమిత్ర సూపర్వైజర్ బసవరాజ్ గోపాలమిత్ర పండరి పశువులదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love