ఈనెల 8న ఉద్యోగ మేళ

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 8 న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి (FAC) ఏ పరమేశ్వర్ రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ మేళ కంపెనీ పేర్లు (1 విశ్వ అగ్రో టెక్ , వేతనం 1000 to 25000 + టి ఏ, డి ఏ ) (2 ఈజ్ ఫే సేల్స్ ) (3 పర్సనల్ లోన్స్) (4 టాటా క్యాపిటల్ )నాలుగు వివిధ కంపెనీలతో నిర్వహించబడును అని తెలిపారు. వయోపరిమితి 18 నుండి 30 సం ‘ల లోపు ఉండవలెను. ఆసక్తి గల నిరుద్యోగ యూవతి / యూవకులు ఉద్యోగ మేళాకు జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్ జిల్లా పాల్గొనగలరు. విద్యార్హత ఎస్ ఎస్ సి, ఇంటర్, డిగ్రీ, చదివి ఉండవలెను. ఉదయం 10 : 30 గం’లకు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీ నగర్, నిజామాబాద్ హాజరు కావలెను. వివరాలకు 6305743423, 9959456793, సంప్రదించండి అని తెలియజేశారు.

Spread the love