ఎస్ ఎఫ్ ఐ నాయకత్వాన్ని ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము

– కొట్లాడి తెచుక్కున తెలంగాణ లో అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యం
– ఎస్ఎఫ్ఐ ఛలో అసెంబ్లీ పిలుపుకు కేసిఆర్ ప్రభుత్వనికి బయమెందుకో – జిల్లా కార్యదర్శి బోడ అనిల్ 

నవతెలంగాణ -కంటేశ్వర్
ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా విద్య రంగ సమస్యల పరిష్కారం కోసం ఛలో అసెంబ్లీ పిలుపు ఇవ్వడం జరిగింది. విద్యార్థి ఉద్యమాలకు భయపడి నిజాంబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా sfi నాయకులను మందస్తుగా అరెస్టు చేయడం జరిగింది ఈ సంధర్బంగా SFI జిల్లా కార్యదర్శి బోడ.అనిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగం గురించి చర్చించి సమస్యలు పరిష్కారం చేయాలని, నూతన విద్యావిధానం 2020 ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీ లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ళుగా 5,177 కోట్లు పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు పెండింగ్ రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయలేదని, గురుకులాలు, కెజిబివిలు‌,మోడల్ స్కూల్స్ లో సమస్యలు అలాగే ఉన్నాయని వాటిని పరిష్కారం చేయలేదని మెస్ బిల్లులు విడుదల చేయలేదని, యూనివర్శీటీలలో ఫీజులు పెంచి ఉన్నత విద్యకు దూరం చేస్తుందని ,ప్రైవేట్ విద్యాసంస్థలలో భారీగా పెంచిన ఫీజులు,విద్యారంగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, తగ్గిన నిధులు కేటాయింపు, గురుకులాలకు సోంత భవనాలు నిర్మాణం చేయాలని,ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. రాష్ట్రంలో బిజెపి తెస్తున్న నూతన విద్యావిధానం కూడా అమలు చేయలేమని తీర్మానం చేయాలని అన్నారు. నిజాంబాద్ నగరంలోని 5వ టౌన్ పరిధిలో అరెస్ట్ అయినవారిలో SFI జిల్లా కార్యదర్శి బోడ.అనిల్, నగర కార్యదర్శి P. మహేష్, ఎస్ఎఫ్ఐ మాజీ కార్యదర్శి ప్రస్తుత డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి, నాయకులు గణేష్, విశాల్ అదేవిధంగా బోధన్, తెలంగాణ యూనివర్సిటీ లో ఎస్ఎఫ్ఐ నాయకులను, అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. వారందరినీ విడుదల చేయాలని లేని పక్షంలో ఈ ప్రభుత్వం పోరాట సెగని అనుభవించాల్సి వస్తుందని అన్నారు.
Spread the love