ఘోర రైలు ప్రమాదం..22 మంది మృతి

నవతెలంగాణ – ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పి దాదాపు 22 మంది మరణించారు. సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. హజరా ఎక్స్‌ప్రెస్ రావల్పిండికి వెళ్తుండగా.. షాజాద్‌పూర్, నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు 10 బోగీలు పట్టాలు తప్పిపోయాయి. దీంతో 15 మంది అక్కకిడక్కడే మృతి చెందారు. కరాచీ నుంచి పంజాబ్‌కు వెళ్లే ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. సహాయక చర్యలు ప్రారంభించామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Spread the love