అలుపెరుగని పోరాటం పాత్రికేయులదే: అల్లరి నారాయణ..

నవతెలంగాణ -హైదరాబాద్: అలుపెరుగని పోరాట యోధులు సమ సమాజంలో అనేక విభాగాల్లో ఉన్న ఏ ఆదాయం ఆశించకుండా సమాజమే కుటుంబంగా భావిస్తూ పనిచేసే వారు పాత్రికేయలని అల్లం నారాయణ అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లల్లో వయోధిక పాత్రికేయ సంఘం ఏర్పాటుచేసిన సమావేశంలోహొవయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరినీ మీడియా అకాడమీ చైర్మన్ ఆల్లం నారాయణ,సంఘ అధ్యక్షులు దాసు కేశవరావు,ఎన్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…దుర్బర జీవితాన్ని గడిపే సీనియర్ జర్నలిస్టు కోసం అత్యవసర నిధి ఏర్పాటుకు కట్టుబడి తనవంతుగాలక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు.అక్రిడేషన్ కమిటీ పునరుద్ధించేందుకుహొవీలు లేదు కావున వయోధిక పాత్రికేయుల,చిన్న పత్రికల,ఉర్దూ పాత్రికేయుల సమస్యలపై చర్చలు జరుగుతున్నాయనీ ప్రభుత్వానికి వ్రాత పూర్వకంగా రాసి సమస్య పరిష్కారం కృషి చేస్తానన్నారు.పాత్రికేయులకు ఇచ్చిన వైద్య కార్డులు ఏ ఆసుపత్రిలో చల్లకుండా కేవలం నిమ్స్ లోనే చల్లడం లేదని నిమ్స్ లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయనిజర్నలిస్టుల కొరకు ప్రత్యేకంగా వైద్య అందించే విధంగా నిమ్స్ డైరెక్టర్తో చర్చిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఉదయవార్లు,శ్రీనివాసరావు,కార్యదర్శి లక్ష్మణరావు ఉప కార్యదర్శులు రాజేశ్వరరావు, రామామూర్తి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులుప్రసాద్, ప్రతాప్, చంద్ర, ఈశ్వర్, భగీరథ, రాజేశ్వరి, రామకృష్ణ ,శివకుమార్ రవి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love