నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ఎన్ హెచ్ ఎం ఫెడరేషన్ ఉద్యోగుల సంఘం నాయకులు కొఠిలోని డిఎంహెచ్ఎస్ ప్రాంగణంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రావణ్ కుమార్, సుబ్రహ్మణ్యం, కరీం, స్వామి, నాథలు మాట్లాడుతూ.. ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని. సమాన పనికి సమాన వేతనం అందించాలని ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని చెప్పారు. వెన్నెచం ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 17,000 మందిని ఎన్ హెచ్ఎంలో పనిచేస్తున్నామన్నారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.