పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి పని కల్పించాలి..

– డిఅర్ డిఎ, డిఅర్ డీఓ పిడి చందర్ నాయక్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
క్షేత్రస్థాయిలో ఉపాధి పనుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కూలీకి ఉపాధి పని కల్పించాలని డీఆర్డీఓ,డిఅర్ డిఎ పిడి చందర్ నాయక్ ఏపీఓలను ఆదేశించారు. శనివారం డిచ్ పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిహమీ సిబ్బందితో సమీక్షా సమావేశం  నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికంగా మొక్కలు నాటేందుకు గుంతలను తవ్వించాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ కి ఐదు సోప్ పిట్లు ఏర్పాటు చేసుకునేలా, గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచాలని, పెండింగ్లో ఉన్న క్రీడా ప్రాంగణాలను వేంటనే పూర్తి  చేయాలని, కెనల్ బౌండరీ చుట్టూ ప్లాంటేషన్, కంపోస్ట్ షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. కూలీలందరికీ జాబ్కార్డులను సత్వరమే అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ గోపిబాబు, ఎపీఓ సుధాకర్రెడ్డి, టీఎలు, ఎఫ్ఎలు పాల్గొన్నారు.
ఐకెపి సిబ్బందితో రివ్యూ మీటింగ్ 
మండల కేంద్రంలోని మహిళ సమాఖ్య భవనంలో ఐకెపి సిబ్బంది తో డీఆర్డీఓ చందర్ నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళ సంఘాలు బ్యాంకు లింకేజీ టార్గెట్ ను పూర్తి చేయాలని, కొత్తగా ఎంటర్ ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింట్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బి గ్రేడ్లో ఉన్న మహిళ సంఘాలను ఎ గ్రేడ్లోకి తీసుకవచ్చేందుకు మహిళ సంఘాలు కృషి చేయాలన్నారు. రివ్యూలో ఎపీయం నాగరాజు, సీసీలు, సీఓలు పాల్గొన్నారు.
Spread the love