నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
మండల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న విశ్వ కర్మలు వడ్రంగి ,కమ్మరి కంచరి , శిల్పి కౌశలి తో పాటు వెల్డింగ్ వర్క్స్ పనిచేస్తున్న వృత్తిదారులకు ఉచిత కరెంటు సౌకర్యం కల్పించాలని బుధవారం అఖిల భారతీయ విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు రాచమల్ల పున్నమాచార్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్నటువంటి ఉచిత కరెంటు విశ్వకర్మలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ కొత్తపల్లి సత్యనారాయణ, హుస్నాబాద్ మండల అధ్యక్షులు ఎగ్గోజు సుదర్శన చారి, ఉప్పుల శ్రీనివాస్, చెన్నోజు నాగభూషణ చారి, అలవోజ్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.