రూరల్ కు కొత్తగా ఒక్క ప్రాజెక్ట్, ఆసుపత్రి తెచ్చారా..?

– ఘర్ వాపసి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాను..
– మాజీ ఎమ్మెల్సీ అరికేల నర్సారెడ్డి.
నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, బీఅర్ఎస్ గా టీఆర్ఎస్ తో మారాక తెలంగాణ తో ఆ పార్టీ కి సంబంధం తేగి పోయిందని,తెరాస జిల్లాకు చేసిందేమీ లేదని, కాలేశ్వరం నీరు నిజామాబాద్ కు రాలేదని,పాత కలెక్టరేట్లు కూల్చి కొత్త కలెక్టరేట్లు కడుతూ దీన్నే అభివృద్ధి అని చుపుతున్నరని, ఆత్మ గౌరవం కోసం తెలంగాణ పోరు జరిగిందని, బిఅర్ఎస్ ను పారద్రోలే రోజులు ఇక వాచ్చాయని,తెలంగాణ ను ఇచ్చిన కాంగ్రెస్ ను  ప్రజలు గెలిపించ బోతున్నారని, పక్క పార్టీ నాయకులను చేర్చుకొని బిఅర్ఎస్ పాలన కొనసాగిస్తుందని ఘర్ వాపసి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చానని,
మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు అరికేల నర్సారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటి సారిగా జిల్లా కు వస్తున్న సందర్భంగా
 బుదవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా, డిచ్ పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..బాజిరెడ్డి గోవర్ధన్ రూరల్ నియోజకవర్గ లో చేసిందేమీ లేదని, అభివృద్ధి నిల్ గా ఉందని, తొమ్మిదేళ్ళలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పాలన్నారు.కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ యైన, ఆసుపత్రి తెచ్చారా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 20 మాత్రమే పూర్తి చేసి, మిగిలిన వాటిని వదిలేశారని పేర్కొన్నారు.గృహలక్ష్మి పథకం పేరిట మరోసారి మోసం చేయడానికి బీఅర్ఎస్ ప్రభుత్వం సిద్దం అవుతుందని,ఎన్నికల్లో గెలుపు కోసం బిసి బందు లాంటి జిమ్మిక్కులు చేస్తూన్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.ఐదు లక్షల కోట్లు అప్పు చేసి కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ప్రజలను మాయ మాటలతో మోసం చేయాలని చూస్తున్న కెసిఆర్ ను ప్రజలు నమ్మరని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయమన్నారు.బిఅర్ఎస్, బిజెపి రెండూ ఒక్కటే నని,ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీల పొత్తు ఖాయమన్నారు.కాంగ్రెస్ పార్టీ కి వ్యక్తులు ముఖ్యం కాదని,గెలుపు ఖాయంగ ప్రజల మధ్య లో వేళ్తమని,రూరల్ లో ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని అరికేల నర్సారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
        బీఅర్ఎస్ పాలనలో ప్రజస్వామ్యం కరువైందని,ఇక్కడ రాచరిక పాలన నడుస్తుందన్నరు.ఈ కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, అమృత పుర్ గంగాధర్, పోలసని శ్రీనివాస్, మాజీ కో ఆప్షన్ సభ్యులు శ్యాంసన్, తో పాటు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Spread the love