నవతెలంగాణ-గోవిందరావుపేట
ముఖ్యమంత్రిని కించపరుస్తూ తప్పుడు వీడియో పోస్ట్ చేసినందుకు మంగళవారం దేపాకకృష్ణ పై కేసు నమోదు అయినట్లు పసర ఏ ఎస్ ఐ నరోత్తం రెడ్డి తెలిపారు. ఏఎస్సై కథనం ప్రకారం లాకావత్ నరసింహ నాయక్ ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదుల పేర్కొన్న విధంగా దేపాక కృష్ణ అనే వ్యక్తి ముఖ్యమంత్రిని కించపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చనిపోయినట్లుగా చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లుగా బలగం సినిమా పాటతో కంపోజ్ చేసి తప్పుడు వీడియో పోస్ట్ చేసినందుకు ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు. అట్టి వీడియోను దేపాక కృష్ణ పసర గ్రామ ప్రజా వేదిక పోస్ట్ వీడియోలు పై జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినందున అతనిపై కేసు నమోదు అయినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. ఇకపై ఫేక్ వీడియోలను గ్రూపులలో పోస్ట్ చేయరాదని చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు. వీడియో పోస్టింగ్ లపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.