– తుమ్మల వెంకటరెడ్డి సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
గాలి దుమారం భారీ వర్షం వల్ల నష్టపోయిన రైతులను కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల వ్యాప్తంగా దెబ్బతిన్న పంట పొలాలను మామిడి తోటలను ఇండ్లను సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ మండలంలో శనివారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలులకు మండలంలోని అనేక గ్రామాలలో ఇండ్లు పంట పొలాలు మామిడి తోటలు దెబ్బతిన్నాయని వెంటనే అధికారులు పరిశీలించాలని సర్వే నిర్వహించి నివేదికలు పంపాలని తుమ్మల వెంకటరెడ్డి సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. పసరలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని పేద ముస్లిం కుటుంబం ఇల్లు పై చెట్టు పడి గోడ కూలి ఇల్లు దెబ్బతిన్నదని మరియు కోటగడ్డలోని దుబ్బాక రవీందర్ రెడ్డి ఇంటి పైకప్పు మొత్తము లేచిపోయిందని పేర్కొన్నారు వెంటనే రెవెన్యూ అధికారులు ఈ ఇండ్లను మరియు మండలంలోని దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఈ గాలి దుమారము గత 40 సంవత్సరాల కింద వచ్చిందని మరి తిరిగి ఇంత గాలి ఈరోజు వచ్చిందని రైతులు పేర్కొన్నారు. మండలములోని మామిడితోటలు గతంలో కొంత వర్షాలకు గాలివానలకు దెబ్బతిన్నాయని ఇప్పుడు పూర్తిగా మామిడి తోటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వెంటనే హర్టికల్చర్ అధికారులు పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పొదిల్ల చిట్టిబాబు, గొంది రాజేష్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు అంబాల, పోషలు, సామ, చంద్రారెడ్డి, దుబ్బాక రవీందర్ రెడ్డి, ఎండి హసీనా, దుబ్బాక పద్మ తదితరులు పాల్గొన్నారు.