మృతుల కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

నవ తెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలో టిఆర్ఎస్ నాయకులు పలువురు మృతుల కుటుంబాలను ఆదివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ముందుగా చల్వాయి గ్రామంలోని గ్రామ రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ బొల్లం ప్రసాద్ తల్లి బొల్లం సుశీల కొద్ది రోజుల కిందట చనిపోగా కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని కల్పించి అన్నివేళలా బి ఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఇదే గ్రామానికి చెందిన ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మల్యాల శివ శంకర్ చనిపోగా శంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని మరియు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చల్వాయి గ్రామానికి చెందిన గో(రేపాటి వెంకటేష్ తండ్రి వీరయ్య చనిపోగా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి భరోసా కల్పించి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది, బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పరామర్శించిన వారిలో ఎంపీపీ శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురపనేని సాయికుమార్ ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్,పృధ్విరాజ్ ఉట్ల మీడియా కన్వీనర్, ఈసం సమ్మయ్య గ్రామ సర్పంచ్, బూ రెడ్డి మధు అధికార ప్రతినిధి, నాం పూర్ణ చందర్ గ్రామ కమిటీ అధ్యక్షులు, చుక్క గట్టయ్య మండల ఉపాధ్యక్షులు, రేండ్ల శ్రీనివాస్ ప్రసార కార్యదర్శి, సత్తుభద్రయ్య మండల కోశాధికారి, తొలి మలిదశ ఉద్యమకారుడు అజ్మీర సురేష్, గూడూరి శ్రీను సీనియర్ నాయకులు, జి. వెంకటేశ్వర్లు, రేండ్ల సంతోష్, జి వెంకట్రావు, జి కనకయ్య, ఏనుగుల సాంబశివరావు,బొడిగె రఘు, కే విజయ్, మేడిపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love