విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండలంలోని మొఘా గ్రామానికి చెందిన గూడ మల్వర్ అనిల్ తండ్రి రాజన్న వయసు 24 సంవత్సరాలు టెంట్ హౌస్ లో డెకరేటరుగా పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం 6:30 గంటల సమయంలో మేనూరు గ్రామానికి చెందిన నారాయణ ఇంటి వద్ద డెకరేషన్ పనిచేస్తుండగా 33 కెవి విద్యుత్ వైరు తగిలింది. వెంటనే మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మరణించినాడు. ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

Spread the love