పెర్కిట్ లో కేసీఆర్ రోడ్ షో..

నవతెలంగాణ – ఆర్మూర్
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రోడ్ షో కు వెళ్తూ మార్గమధ్యంలో పెర్కిట్ చౌరస్తా వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సోమవారం రాత్రి స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love