సైబర్ నేరగాళ్ల ఉచ్చులో యువకుడి ప్రాణాలు బలి..

– ఆర్మూర్ మండలం లోని మగ్గిడి గ్రామంలో
నవతెలంగాణ – ఆర్మూర్

మాటలే పెట్టుబడిగా… సెల్ ఫోన్ లే ఆయుధాలుగా అమాయకపు వ్యక్తులను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు డబ్బులు కొల్లగొడుతున్నారు.. సైబర్ వలలో చిక్కి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో నిత్యం సైబర్ నేరం ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి కేసుల తీవ్రత రోజు రజుకు పెరిగిపోతుంది. సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడి జిల్లాలలోని ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్లను నియమించారు. వీరు షీ టీం బృందాలు కళాబృందాలు ప్రతినిధులు నిత్యం సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఎక్కడో ఒకచోట మోసాలు వెలుగులోకి వస్తున్నవి.

గత కొన్ని సంఘటనలు..
కామారెడ్డి జిల్లాలోని రామ్ రెడ్డికి చెందిన యాగాల నాగరాజుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఎల్ఐసి పాలసీ చేశారు కదా బోనస్ డబ్బులు రూ.19000 వచ్చాయి .మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్ నెంబర్ క పంపుతున్న కోడ్ను ఫోన్ పే లో ఎంటర్ చేయడమే. వెంటనే ఎల్ఐసి బోనస్ డబ్బులు మీకు సంబంధించిన ఖాతాల్లో జమవుతాయి అని అన్నారు ..నమ్మిన ఈయన ఫోన్ పే ఓపెన్ చేసి వచ్చిన కోడ్ను ఎంటర్ చేశారు వెంటనే ఆయన ఫోన్ పే నుండి 4 విడతలలో రూ.98, 250 వెళ్లిపోయాయి. మోసపోయిన అని గ్రహించిన అతను పోలీసులను ఆశ్రయించాడు .ఇదే జిల్లా కేంద్రంలోని గత సంవత్సరం సూమయ్య పీర్దోస్ కు పార్ట్ టైం జాబ్ ఉందంటూ టెలిగ్రామ్ లో కాల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు చెప్పినట్లుగా ఆమె యూట్యూబ్లోకి వెళ్లి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు .సంబంధిత స్క్రీన్షాట్ ను ఆమె సదరు వ్యక్తులకు పంపించారు. వెంటనే ఆమె ఖాతాలోకి ఒక 150 జమ చేశారు ..ఇలా మూడుసార్లు జమయ్యాయి. మళ్లీ ఆమె 3000 పంపించగా ప్రతిగా 5000 తిరిగి పంపించారు.. ఆమె పూర్తిగా నమ్మిందని గ్రహించిన సైబర్ నేరస్తులు ఆమెను అనేకమార్లు డబ్బులు పంపించాలని చెప్పగా అలానే పంపించారు. చివరకు ఆమె పంపిన డబ్బులు తిరిగి తీసుకోవడానికి వీలు లేకుండా పోవడంతో తాను మోసపోయానని గ్రహించింది బాధితురాలు సైబర్ మోసగాళ్లకు సమర్పించుకున్న 1,,30,000 తిరిగి ఇప్పించాలని పోలీసులకు మొరపెట్టుకుంది.
ఏలా జరుగుతున్నాయంటే…
బీమా సంస్థల పేరిట, నకిలీ కస్టమర్ కేర్లుగా మాట్లాడడం, అపరిచితులకు యూపీఐ ,ఓటిపి నంబర్లు చెప్పడం,, ఉద్యోగాలు కల్పిస్తామని ,,కేవైసీ అప్డేషన్ అంటూ మోసాలు, బీమాలు ,లాటరీలు బహుమతుల పేరిట నమిస్తున్నారు. అంతర్జాల రుణ యాప్లు ,క్యూఆర్ కోడ్ స్కానింగ్ ,సామాజిక మధ్యమాలలో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించటం, ఏటీఎం క్రెడిట్ కార్డుల ద్వారా సి వి వి,, ఎక్స్పైరీ డేట్ ,డిజిటల్ నంబర్ల పేరుతో నమ్మించడం, పెళ్లి సంబంధాల కోసం నకిలీ వెబ్సైట్లోకి వెళ్తూ ఫోటోలు మార్పింగ్ చేయడం, వీడియో కాల్స్ తో నగ్న సంభాషణలతో బ్లాక్ మెయిల్ చేస్తూ సైబర్ నేరస్తులు ఎందరినో వేధిస్తూ అధిక మొత్తాలను కాజేస్తున్నారు.
ఇలా కట్టడి చేయవచ్చు..
కఠినమైన పాస్వర్డ్ లను పెట్టుకోవడం,, తరచూ మార్చుకోవడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లలో ప్రొఫైల్ లాక్ చేసుకోవాలి ..సామాజిక మధ్యమాల్లో కుటుంబ సమేత ఫోటోలు ప్రొఫైల్ గా పెట్టుకోవద్దు. అపరిచితుల నుంచి వచ్చే లింకులు ,మెసేజ్లను తెరిచి చూడవద్దు. గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం చెప్పవద్దు ..సామాజిక మధ్యమాల్లో ఎవరైనా డబ్బులు పంపమని కోరితే సంబంధిత వ్యక్తితో మాట్లాడి నిర్ధారించుకోవాలి. కస్టమర్ కేర్ నంబర్ను సంబంధిత అధికారిక వెబ్సైట్లోనే తీసుకోవాలి..
ఇలా చేయండి..
సైబర్ నీరగాళ్ల ఉచ్చులో చిక్కి మోసపోయిన బాధితులు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 19 30 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి..cybercrime. gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. 24 గంటల్లోపు ఫిర్యాదు చేసినవారికి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకునే అవకాశాలు ఉటాయని పోలీసులు చెబుతున్నారు.
మగ్గిడి గ్రామంలో యువకుడు ఆత్మహత్య..
మండలంలోని మగ్గిడి గ్రామానికి చెందిన 19 సంవత్సరాల మోతే నాగరాజు అనే యువకుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మోతే భూమన్న యామాల చిన్న కొడుకు నాగరాజు జిల్లా కేంద్రంలోని డిగ్రీ పూర్తి చేసినారు.. ప్లే స్టోర్లో తనకు తెలియని ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవడంతో సైబర్ నేరగాళ్లు నేరుగా మృతుడు నాగరాజుకు ఫోన్ చేసి తనకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వని ఎడల కేసులు బుక్కు చేస్తామని బురడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తూ వేధించ సాగారు. కాగా ఈ సైబర్ నేరగాళ్ల వేధింపులు భరించలేక ఈ యువకుడు ఇంటి వద్ద గత రెండు రోజుల కిందట గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా ,జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు. చికిత్స పొందుతూ నాగరాజు శనివారం మృతి చెందగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నవి.
Spread the love