దిశ ఫౌండేషన్ సభ్యులకు గుర్తింపు కార్డుల జారీ

నవ తెలంగాణ-గోవిందరావుపేట
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ మండల సభ్యులకు ఆదివారం దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండర్ అండ్ చైర్మన్ బి వి రాజు ఆదేశాల మేరకు సంస్థ ములుగు జిల్లా అధ్యక్షులు పెనుమత్స మాధురి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిల్లల లీలా రాణి లు గుర్తింపు కార్డులను జారీ చేశారు. దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ గోవిందరావుపేట మండల అధ్యక్షురాలిగా దొరిసోజు జయమ్మ నియమిస్తూ మిగతా సభ్యులకు గుర్తింపు కార్డులను అందించారు. ఈ సందర్భంగా జయమ్మ మాట్లాడుతూ సామాజికంగా గృహపరంగా మహిళలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల పట్ల దిశా కమిటీ సభ్యులు సత్వర పరిష్కారం కొరకు కృషి చేస్తారని అన్నారు. కమిటీ సభ్యులలో సిహెచ్ వసంత ఝాన్సీ రాణి, పాలువాయి సుజాత, మురహరి యాదలక్ష్మ, జి భవాని, ఏ సరస్వతి, సిహెచ్ మన్నెమ్మ, ఎం శ్రావణి, డి ధనమ్మ, పి సృజన, టి ఉని, కే కైక, ఎల్ అచ్చమ్మ, పి యకలక్ష్మి తదితరులు ఉన్నారు.

Spread the love