నవతెలంగాణ-మంగపేట : మండలంలోని కోమటిపల్లి బూర్గుల నాగయ్యకు చెందిన సూడి గేదె గ్రామంలోని ఎస్ఎస్1 ట్రాన్స్ ఫారం ఫీజు స్థంభం ఎర్త్ వైరుకు తాకి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఉదయం గ్రామం సమీపంలోని అడవికి మేకు వెళ్లిన సూడిగేదె సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో గ్రామం ప్రవేశంలోని ఎస్ఎస్1 ట్రాన్స్ ఫారం చుట్టూ ఎలాంటి రక్షణలేకపోవడంతో గడ్డిమేస్తు విధ్యుద్ఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన సూడి గేదే విలువ సుమారు 70 వేల వరకు ఉంటుందని పాలు అమ్మకుని కుటుంబాన్ని పోషించుకనే తాము గేదె మృతితో తీవ్రంగా నష్టపోయినట్లు బాదితుడు నాగయ్య తెలిపారు. విధ్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే సూడి గేదె మృతి చెందిందని సంస్థ నుండి నష్టపరిహారం ఇప్పించాలని బాదితుడు డిమాండ్ చేశారు.