అర్ఆర్అర్ సెంటర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న ఆదివారం అర్ ఆర్ అర్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రజిత మాట్లాడుతూ అర్ ఆర్ అర్ సెంటర్ లో ఇంటిి వద్ద చాలా రోజుల నుండి వాడుకొని వస్తువులను తీసుకువస్తే రెడ్యూస్ రీయుస్, రీ సైక్లింగ్ చేసి పంపిస్తారని తెలిపారు. జూన్ 5 వరకు సెంటర్ ఉపయోగంలో ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోమటి స్వర్ణలత, ఐలేని శంకర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు యండి అయూబ్, కమిషనర్ సుంకే రాజమల్లయ్య, ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, నరేష్, రాజమౌళి, మెప్మా ఆర్పి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love