వజ్రోత్సవాలు పూర్వ విద్యార్థుల్లో చైతన్యం ఐకమత్యాన్ని పెంచింది

– హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
వజ్రోత్సవాలు పూర్వ విద్యార్థుల్లో చైతన్యంతో పాటు ఐకమత్యాన్ని పెంచిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 1974-75 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన పాలరాతి సరస్వతి విగ్రహన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతి ఆశీస్సులు విద్యార్థి లోకానికి ఉండాలని, తద్వారా మేధా సంపత్తిని పెంచుకోవచ్చని అన్నారు. 75 సంవత్సరాల వజ్రోత్సవాలు సప్తాహంతో ముగియలేదని ఏడాది పాటు పూర్వ విద్యార్థి సమ్మేళనాలతో ఇతర కార్యక్రమాలతో కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనిత, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, హుస్నాబాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనీలా, వజ్రోత్సవ కమిటీ కన్వీనర్ కొండ లక్ష్మణ్, వజ్రోత్సవాల సప్తోత్సవ కన్వీనర్లు, ఎక్సైజ్ ఉప పర్యవేక్షకులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ లింగమూర్తి, స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షులు శంకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిత్తారి రవీందర్ 1974-75 బ్యాచ్ పూర్వ విద్యార్థుల కన్వీనర్ కొత్తపల్లి దేవేందర్, పూర్వ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Spread the love