ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల్లో నమ్మకం

– సురక్షా దినోత్సవంలో ఎంపిపి మాణిక్య రెడ్డి
నవతెలంగాణ – చిన్నకోడూరు
పోలీస్ అంటేనే భయపడిన కాలం నుండి ఏ సమస్య అయినా పోలీస్ ద్వారానే పరిష్కారం అని ప్రజలు విశ్వసించే స్ధాయికి చేరడానికి తెలంగాణ పోలీసులు స్నేహపూర్వక విధానం అవలంభించడం వల్లే సాధ్యమైందని చిన్నకోడూరు ఎంపిపి మాణిక్యరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో సురక్షా దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతంగా పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తర్వాత పోలీస్ వ్యవస్థ పనితీరులో మార్పును వివరించారు. సిద్దిపేట నియోజకవర్గంలో సిసి కెమెరాల ఏర్పాటు మంత్రి హరీశ్ రావు కృషి అన్నారు. ఒక్క ఫోన్ కాల్ తో ఘటనా స్థలానికి చేరుకుని భద్రత కల్పించే పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఉదయం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన రన్ ఫర్ హెల్త్ 5కి.మీ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం నిర్వహించారు. రన్ ఫర్ హెల్త్ కార్యక్రమంలో పాల్గొని విజవంతం చేసిన ప్రజాప్రతినిధులకు, యువతకు ఎస్ఐ శివానందం ధన్యవాదములు తెలిపారు. అనంతరం పరుగులో విజేతలు హేమంత్, కొమ్ము అజయ్, రాజిరెడ్డి లకు బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట గ్రామీణ సిఐ జానకి రాం రెడ్డి కలిసి షీల్డ్ అందజేశారు. నారాయణరావుపేట ఎంపిపి బాలమల్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, ఎంపిపి ఉపాధ్యక్షుడు కీసర పాపయ్య, అల్లీపూర్ సొసైటీ చైర్మన్ సదానందం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాముని ఉమేష్, సర్పంచులు గాజుల బాబు, ఆంజనేయులు, కాల్వ ఎల్లయ్య, జయవర్ధన్ రెడ్డి, నాయకులు ఎల్లాగౌడ్, బాలు, లింగం, బిఆర్ఎస్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు గుడిమల్ల రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

Spread the love