హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, నేరం

– కేఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజక్కపేటలో ఉచిత హెల్మెట్ల పంపిణీ
– రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా యువతకు హెల్మెట్ల బహుకరణ
– నియోజకవర్గంలోని ప్రతి మండలం,ప్రతి గ్రామంలో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు
– హెల్మెట్ ధరించి ప్రయాణించాలని యువతకు,గ్రామస్తులకు పిలుపు
– కార్యక్రమంలో మాట్లాడుతున్న సిద్దిపేట
– అడిషనల్ డీసీపీ(అడ్మిన్) మహేందర్, దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ, ఎస్ఐ మహేందర్
– కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులకు పలువురి అభినందనలు, ప్రశంసలు
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
రోడ్డు ప్రమాదాల భారీ నుండి హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుంది. బాధ్యతాయుతంగా వాహనదారులు హెల్మెట్ ధరించిన ప్రయాణించాలి. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, నేరమని సిద్దిపేట జిల్లా అడిషనల్ డీసీపీ(అడ్మిన్) మహేందర్ అన్నారు.ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో మనకోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కోమటి రెడ్డి రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తన స్వగ్రామమైన రాజక్కపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట అడిషనల్ డీసీపీ(అడ్మిన్) మహేందర్, దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ, ఎస్ ఐ మహేందర్ తో పాటు సర్పంచ్ పెరుగు పద్మ,ఉపసర్పంచ్ గంధం ఊర్మిళ, ఎంపీటీసీ సభ్యురాలు కోమటి రెడ్డి మమత హాజరయ్యారు. అనంతరం గ్రామస్తులకు,యువతకు హెల్మెట్ ధరించి ప్రయాణించడంలో కలిగే లాభ, నష్టాలను వివరించారు.ఈ సందర్భంగా సిద్దిపేట అడిషనల్ డీసీపీ(అడ్మిన్) మహేందర్ మాట్లాడుతూ… కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి కేఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించి మంచి మనసుతో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించి,ఉచితంగా హెల్మెట్లు పంపణి చేయాలన్న నిర్ణయాన్ని వారు అభినందించారు.గతంలో హెల్మెట్ లేకుండా ప్రయాణించి, రోడ్డు ప్రమాదాల భారీన పడి వాహనదారులు లక్షలు ఖర్చు చేసిన ప్రాణాలు కాపాడుకోలేక మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని డీసీపీ గుర్తు చేశారు.అలాంటి ప్రమాదాలు యువత పడకుండా.. ట్రాఫిక్ నియమాలు నిబంధనలు పాటిస్తూ….హెల్మెట్ ధరించి జాగ్రత్త ప్రయాణించాలని సూచించారు.హెల్మెట్,సరైన ధ్రువ పత్రాలు కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని లేని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కేఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి రజనికాంత్ రెడ్డి మాట్లాడుతూ పుట్టిన ఊరికి ,మండలానికి మంచి చేయాలనే సంకల్పంతో మనకోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించా.. .మూఢనమ్మకాల నిర్మూలన, ఆత్మహత్యలు, ప్రమాదాల నివారణకు ఉపయోగపడే వాటితో పాటు మరెన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేయాలన్న తపనతోనే మనకోసంఁ కె.ఆర్.ఆర్ ఫౌండేషన్ఁ ద్వారా సేవలందించడమే లక్ష్యమన్నారు. ఇటీవల తోర్నాలలో దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చేర్వపూర్ వార్డ్ కి చెందిన ఇద్దరూ యువకులు హెల్మెట్ల లేని ప్రయాణం చేసి మృతి చెందారని… ఆ సంఘటన ప్రభావం వల్లే తాము ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ వర్గంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తానని సభలో వ్యాఖ్యానించారు.హెల్మెట్ ధరించి ప్రమాదాలా భారీన పడకుండా ఉండాలనే లక్ష్యంతో సుమారు కోటి రూపాయలతో హెల్మెట్లు పంపిణీ చేశామన్నారు. ఆతర్వాత గ్రామ పంచాయితీ నుండి హెల్మెట్ ధరించి వహనదారులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముందు ముఖ్య అతిథులకు రజినీకాంత్ రెడ్డి శాలువాతో సన్మానించారు.రజినీకాంత్ రెడ్డి చేస్తున్న సేవలపై పలువురు అభినందనలు, ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు కోమటిరెడ్డి రాధా మనోహర్ రెడ్డి, పాతూరి మోహన్, ఇళ్దాం రజనీకాంత్ రెడ్డి, రెడ్డి. మోహన్ రెడ్డి, మూర్తి కరుణాకర్ రెడ్డి, కోమటిరెడ్డి భాను, తొగుట అనిల్, గ్రామస్తులు, యువత ఉన్నారు.

Spread the love