హైదరాబాద్‌లో భారీ వర్షం..చెరువును తలపించిన రోడ్డు

నవతెలంగాణ-హైదరాబాద్‌: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. నగరంలోని మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ, ఎల్బీనగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది.
వనస్థలిపురం చింతలకుంట వద్ద జాతీయరహదారిపై భారీగా వరదనీరు చేరడంతో చెరువును తలపించింది. దీంతో పనామా- ఎల్బీనగర్‌ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Spread the love