టాలీవుడ్‌ లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులు మృతి చెందారు. అయితే తాజాగా మరో కీలక నటుడు మరణించారు. ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. వెట్ట యాడు విలయాడు, వడా చెన్నై లాంటి సినిమాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇక తెలుగులో సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ సినిమాలలో విలన్ గా పని చేశారు బాలాజీ. ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అలాగే అభిమానులు బాలాజీకి నివాళులు అర్పిస్తున్నారు.

Spread the love