ఐదు హామీలను ప్రకటించిన కాంగ్రెస్

congress-held-a-huge-public-meeting-in-tukkugudaనవతెలంగాణ-హైదరాబాద్ :   ‘నారీ న్యాయ్’లో భాగంగా మహిళలకు   ఐదు హామీలను  కాంగ్రెస్‌  శుక్రవారం ప్రకటించింది.   తాము అధికారంలోకి వస్తే .. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.   శక్తివంతమైన మహిళలు భారత భవితవ్యాన్ని మారుస్తారని ఉద్ఘాటించారు.   ఇప్పటికీ ముగ్గురిలో కేవలం ఒక్క మహిళ మాత్రమే ఉద్యోగం చేస్తున్నారని, పది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్క మహిళ మాత్రమే ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. భారత్‌లో మహిళా జనాభా 50 శాతం కాదా, సెకండరీ, ఉన్నత విద్యల్లో మహిళల వాటా 50 శాతం లేదా.. మరి వ్యవస్థలో వారి భాగస్వామ్యం ఎందుకు తక్కువగా ఉందని ప్రశ్నించారు.  మహిళలు ‘ సగం జనాభా అయినా పూర్తి హక్కులు’ ఉండాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని అన్నారు.

‘నారీ న్యాయ్ ’ లో భాగంగా మహిళలకు  ఐదు హామీలను ప్రకటించారు.

  • భారతదేశంలోని ప్రతి పేద కుటుంబానికి చెందిన మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది.
  • పార్టీ అధికారంలోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వ పదవులకు వచ్చే కొత్త రిక్రూట్‌మెంట్‌లలో 50 శాతం మహిళలకు రిజర్వ్‌ చేస్తామని ప్రకటించారు.
  • ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది.
  • మహిళలకు చట్టంపై అవగాహన కల్పించేందుకు, హక్కుల అమలులో సహాయం అందించేందుకు ప్రతి గ్రామ పంచాయితీలోనూ అధికార మైత్రిని నియమిస్తామని హామీ ఇచ్చింది.
  • ‘సావిత్రిభాయి పూలే హాస్టల్స్‌’ను ఏర్పాటు చేస్తామని, దీని కింద దేశంలోని వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వ రెట్టింపు చేస్తుందని, ప్రతిజిల్లాలో కనీసం ఒక హాస్టల్‌ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Spread the love