చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి

– మెదక్ ఎంపీగా నీలం మధు గెలుపు ఖాయం
– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
– చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపి అభ్యర్థి నీలం మధు ముదిరాజ్.
– ఎంపి అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపిన నీలం మధు.
నవతెలంగాణ – తొగుట 
మెదక్ లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి మెదక్ నుండి పోటీ చేస్తున్న నీలం మధు ముది రాజ్ దుబ్బాక నియో జకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి తన గెలుపునకు మద్దతు తెలిపి సహాకారం అందించా లని విజ్ఞప్తి చేశారు. ఈ సంద ర్భంగా చెరుకు శ్రీని వాస్ రెడ్డి మాట్లాడుతూ పార్ల మెంట్ ఎన్నికలలో నీలం మధుకు తన సంపూర్ణ సహకారాన్ని అంది స్తామని, మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ గెలు పు కోసం కృషిచేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే అయిదు గ్యారెంటీలు అమలు చేశామని, బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల కు ఉచిత బస్ ప్రయా ణం, ఉచిత కరెంట్, నిరుపేదలకు రూ. 10 లక్షల ఆరోగ్య భీమా వంటి పథకాలు గుర్తించి ప్రజలు తెలంగాణలో మెజారిటీ ఎంపి స్థానాలు గెలిపిస్తా రని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే దుబ్బాక నియోజకవర్గం లో సుమారు రూ. 20 కోట్లకు పైగా అభివృద్ది పను లు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖల సహకారంతో రాబోయే రోజుల్లో మారిన్ని నిధులు మంజూరు చేయించి  నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలో నడి  పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, జిల్లా నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి, బుస నిరంజన్ రెడ్డి, తాడెం వెంగల్ రావు, నాయకులు నాగరాజు, కళాకారులు బండకాడి తదితరులు పాల్గొన్నారు.
Spread the love