ప్ర‌పంచ యుద్ధం జ‌ర‌గ‌బోనివ్వం: పుతిన్‌

నవతెలంగాణ – మాస్కో: ప్ర‌పంచ యుద్ధాన్ని నివారించేందుకు ర‌ష్యా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. విక్ట‌రీ డే మిలిట‌రీ ప‌రేడ్‌లో పాల్గొన్న ఆయ‌న దేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. త‌మ దేశం ఎటువంటి బెదిరింపుల‌ను స‌హించ‌బోద‌న్నారు. ర‌ష్యా మిలిట‌రీ అన్ని వేళ‌లా అప్ర‌మ‌త్తంగా ఉంటుంద‌ని, దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడేందుకు రెఢీగా ఉన్న‌ట్లు పుతిన్ తెలిపారు. రెండో ప్ర‌పంచ యుద్ధ జ్ఞాప‌కాల‌ను ప‌శ్చిమ దేశాలు మ‌రిచిపోవాల‌నుకుంటున్నాయ‌ని, కానీ మాస్కో, లెనిన్‌గ్రాండ్ వ‌ద్ద జ‌రిగిన యుద్ధాలతో ఎదురైన‌ న‌ష్టాన్ని ఎవ‌రూ మ‌రిచిపోలేర‌న్నారు.

 

Spread the love