చట్ట పరిరక్షణకై పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ-భువనగిరికలెక్టరేట్
వలసలను ఆపాలని, గ్రామీణ వ్యవసాయ కూలీలకు పని చూపాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి పార్లమెంటులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిన సీపీఐ(ఎం)ను, నేడు చట్టాన్ని ఎత్తివేయాలని చూస్తున్న మోడీ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్ట పరిరక్షణ కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్  సుత్తి కొడవలి నక్షత్రము పైన ఓట్లు వేసి గెలిపించాలి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని నమాత్ పల్లి, బండసోమవారం, ముస్త్యాలపల్లి, వీరవెల్లి గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల వద్ద, అమాలి కార్మికుల దగ్గర సీపీఐ(ఎం) అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించగా , ఆయన అతిథిగా ముఖ్య అతిథిగా హాజరై , మాట్లాడారు. కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజల పైన బారాలు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పదం చేయడం, ప్రజల హక్కులను కాలరాయడం, రాజ్యాంగం లోని ముఖ్యమైన విషయాలను తొలగించడం, ప్రజలకు ఉన్న చట్టాలను తొలగించడం లాంటివి తప్ప ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. పోరాటాలు చేసి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని , సమాచార హక్కు చట్టాన్ని, మూడు హక్కుల చట్టాన్ని భూ సేకరణ చట్టాన్ని , కార్మికుల చట్టాలను మార్చి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా నూతన చట్టాలను తీసుకురావడానికి బిజెపి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుందని అన్నారు. మరో భారత దేశంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగం అనేది ఉండదని, భారత రాజ్యాంగం రిజర్వేషన్లు కొనసాగే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చారు. సనాతన పద్ధతులను తెచ్చి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని పూర్వపు ఆచారాలను కులాన్ని మతాన్ని మళ్లీ ముందుకు తెచ్చి దేశ సమైక్యత సమగ్రత దెబ్బతీయాలని చూస్తున్న బిజెపిని ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. అవకాశవాద కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏమి లేదని ప్రజలను మభ్యపెట్టడం మోసగించడం లాంటివి తప్ప ప్రజల హక్కుల కోసం ఏనాడు పోరాటం చేయలేదని ఇలాంటి పార్టీలకు అవకాశం ఇవ్వద్దని నిరంతరం ప్రజల పక్షాన ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం పోరాడుతున్న సిపిఎం సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను దేశ ఐక్యత విషయాలను పార్లమెంట్లో చర్చించడానికి అవకాశం ఉంటుందని అలాంటి అవకాశాన్ని ప్రజలందరూ జహంగీర్ ని గెలిపించి కల్పించాలని కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు ఎల్లంల వెంకటేష్ ,జిట్టా అంజిరెడ్డి,సిలివేరు ఎల్లయ్య ముస్త్యాలపల్లి శాఖ కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, యాదగిరి, మండల నాయకులు వడ్డెబోయిన వెంకటేష్,యాదమ్మ , బుచ్చమ్మ, సుగుణమ్మ ,అండమ్మ, చంద్రమ్మ, మనమ్లు పాల్గొన్నారు.
Spread the love