ప్రచారంలో ముందున్న సీపీఐ(ఎం)

– ప్రజలతో మమేకమవుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్
నవతెలంగాణ –  భువనగిరి
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) ప్రచారంలో అందరికంటే ముందుంది. భువనగిరి పార్లమెంట్ సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ ప్రజలతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారునిర్వహిస్తున్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థిగా రాష్ట్ర పార్టీ ఎండి జహంగీర్ణు ప్రకటించిన తర్వాత ముందుగా పుట్టిన ఊరు అయినా రామన్నపేట మండలం మునిపంపులకు వెళ్లి అక్కడి ప్రజల నాయకుల కార్యకర్తల ఆశీర్వచనం తీసుకున్నారు.  పార్టీలకతీతంగా సీపీఐ(ఎం) అభ్యర్థిని బలపరచడానికి ముందుకు వస్తున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, జనగాం, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వాన్ని స్నేహితులను కలిసి తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి జహంగీర్ ని పిలిచి బంధువులు స్నేహితులు మద్దతు తెలుపుతున్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ప్రతి ప్రాంతం  సమస్యలు పూర్తిస్థాయిలో తెలిసి ఉండడం అనేక ఉద్యమాలలో పాల్గొనడం కలిసి వచ్చే అంశం.
వెన్నంటి ఉంటున్న చెరుపల్లి సీతారాములు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు జహంగీర్ వెన్నంటి ఉండి మార్గ నిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు పాటించే విధంగా కృషి చేస్తూ పార్లమెంటు నియోజకవర్గం లోని భువనగిరి, ఆలేరు, జనగామ నియోజకవర్గంలలో నియోజకవర్గం సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ నిర్ణయాలను చూస్తూ నాయకులలో కార్యకర్తల్లో ఉత్తేజ నింపుతున్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య భువనగిరి నియోజకవర్గం లో సీపీఐ(ఎం) అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించడంతోపాటు కార్మిక కర్షక వర్గాలలో పర్యటిస్తున్నారు, సోషల్ మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ యువకులకు ఎన్నికల్లో నిర్వహించవలసిన పాత్రను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.
సాహితీవేతల మద్దతు.
తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజికవేత్త, గ్రంథాలయ స్థాపకులు, సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు సాగిస్తూ కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు అందుకున్న డాక్టర్ కూరెల్ల విఠలాచార్య జహంగీర్ ను దగ్గరికి తీసుకొని ఆశీర్వదించడంతోపాటు తన మద్దతును ప్రకటించారు. నేటి రాజకీయాలలో అవినీతి, అక్రమాలు, వ్యాపారాలు లేని వ్యక్తి జహంగీర్ ను గెలిపించాలని కోరారు. తన జీవితమంతా ప్రజలకు ప్రజల యొక్క హక్కుల కోసం పనిచేసిన వ్యక్తిగా గుర్తించాలని కోరారు. పలువురు సహితి సంస్కృతి నేతలు ప్రజాసంఘాలవారు సీపీఐ(ఎం) అభ్యర్థికి మద్దతు తెలపడంతో పాటు గెలిపించాలని ప్రజలకు విన్నపం చేస్తున్నారు.
కళాకారుల మద్దతు. 
ప్రజాతంత్ర, లౌకిక వాదులను గెలిపించాలని కోరుతూ ప్రజా నాట్య మండలి కళాకారులు సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ కి మద్దతు ప్రకటించారు.  జహంగీర్  గెలుపు కోసం రెండు రోజుల పాటు భువనగిరిలో రాష్ట్రస్థాయి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఎన్నికలలో నిర్వహించవలసిన పాత్ర, ప్రజలకు ఎన్నికల ప్రాముఖ్యం, మత సామరస్యాన్ని వివరించనున్నారు, అందుకోసం నూతనంగా, పాటలు, ఆటలు ప్రచారానికి అవసరమయ్యే అన్ని రంగులను సమకూర్చుకుంటున్నారు.
Spread the love