వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించబడింది

– బిజెపి ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి, హిందూ ముస్లింల తగాదాలుగా చిత్రీకరిస్తుంది
– అమరజీవి దుంపల మల్లారెడ్డి 18 వ వర్ధంతి సభ
– భువనగిరి పార్లమెంటు సిపిఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలుపించాలి
నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్
ప్రపంచ విప్లవాల్లో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సువర్ణ అక్షరాలతో లికించబడిందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మంగళవారం, రాత్రి  యాదగిరిగుట్ట మండలం కాచారం, వీర తెలంగాణ సాయుధ పోరాట యోధులు అమరజీవి దుంపల మల్లారెడ్డి 18 వ వర్ధంతి సభ, బహిరంగ సభ ను సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా దుంపల మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వీరయ్య, సీతారాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దళ నాయకుడిగా దుంపల మల్లారెడ్డి ఆలేరు బోనగిరి ప్రాంతంలో వన్నెతెచ్చిన ఆదర్శ జీవితాన్ని గడిపినాడని అన్నారు. అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి హిందూ ముస్లింల తగాదాలుగా చిత్రీకరిస్తున్నారని  వారన్నారు. కేంద్రంలో అధికారం లో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ 10 ఏళ్లు కాలంలో ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బిజెపిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని అన్నారు. దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న సమయాన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చి ఆస్థానంలో మనుధర్మాన్ని తీసుకొచ్చి ఫ్యూడల్ పద్ధతులు ప్రవేశం పెట్టడం కోసం కృషి చేస్తుందని అన్నారు. దీని ద్వారా కుల మత ప్రాంతా విద్వేషాలు సృష్టిస్తుందన్నారు. దీనికి అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చడమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఇప్పటికే సి ఏ ఏ పౌరసత్వ రద్దు జ్యోతిష్య శాస్త్రం, విద్యా కాషాయీకరణ, ఈ డి, సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను బెదిరించడం, లొంగదీసుకోవడం, మేధావులను జైల్లో పెట్టడం లాంటి వాటిని బలవంతంగా అమలు చేస్తుందని అన్నారు. బిజెపి గత ఎన్నికలలో రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని చెప్పిందని అన్నారు. నల్ల డబ్బును బయటకు తీసి దేశ ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పిందని అన్నారు. కానీ బిజెపి అధికారంలోకి వచ్చాక అవినీతి చట్టబద్ధత కలిగించిందని పేర్కొన్నారు. ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో 1600 కోట్ల రూపాయల్లో 800 కోట్ల రూపాయలు బిజెపికి చేరాయని అన్నారు
ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ చట్ట విరుద్ధమని సీపీఐ(ఎం) పోరాడిందని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల అవినీతి బయటికి వచ్చింది అన్నారు. విద్యారంగానికి కేవలం 0.4% మాత్రమే నిధులు కేటాయించాలని విద్యను పూర్తిగా ప్రయివేటీకరణ చేసిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ను గెలిపించాలి అన్నారు. నిరంతరం పేదల కోసం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించండి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి గా బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఎండి జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. బహిరంగ సభలో వారు ప్రజలను కోరారు. బోనగిరి పార్లమెంటు పరిధిలో సిపిఐ(ఎం) అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిందని అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించాలని వారు అభ్యర్థించారు. ఈ బహిరంగ సభకు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు సిపిఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్, సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరి బాలరాజ్, కల్లూరు మల్లేష్, ఆనగంటి వెంకటేష్, గడ్డం వెంకటేష్, నూకల భాస్కర్ రెడ్డి, వంటేరు పెంటారెడ్డి, నేలపట్ల శంకర్,  ఎంపీటీసీ ఎడ్ల సుగుణ రామిరెడ్డి, మాజీ సర్పంచ్ కొండం అరుణ అశోక్ రెడ్డి, దుంపల రాంరెడ్డి, కానుగంటి లక్ష్మారెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు కొల్లూరి రాజయ్య, జనశక్తి నాయకులు ఇప్ప రామకృష్ణ, న్యూ డెమోక్రసీ నాయకులు బెజడి కుమార్, సిపిఎస్ఐ నాయకులు సుంచు దేవయ్య, పెద్ద కందుకూరు మాజీ సర్పంచ్ భీమగాని రాములు గౌడ్, ప్రజానాట్యమండలి నాయకులు యీర్లపల్లి ముత్యాలు, శివ, కాలే స్వామి, బబ్బురి శ్రీను, ఎస్.కె లతీఫ్, ఎస్కే షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love