దుబ్బాక నియోజకవర్గ అభవృద్దే లక్ష్యంగా పని చేస్తా

– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – తొగుట
సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో దుబ్బాక నియో జకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తానని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆది వారం మండలం కేంద్రం తొగుట, ఎల్లారెడ్డిపేట, కాన్గల్ గ్రామాల్లో కులసంఘాలు, ఫంక్షన్ హాల్  నిర్మా ణాల కోసం నిధులు మంజూరు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొగుట గ్రామానికి నాయి బ్రాహ్మణ కమిటీ హాల్, కాన్గల్ గ్రామంలో యాదవ సంఘం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, ఎల్లారెడ్డిపేట గ్రామంలో ముస్లిం కమిటీ హల్ కు రూ. 10 లక్షలు, ఎస్సీ కమిటీ హల్ కు రూ. 10 లక్షలు , సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ. 10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా  అభివృద్ది కార్యక్రమాల కు నిధులు మంజూరు చేయిస్తానని, తొగుట మండలం కు నిధుల మంజూరు కు సహకరించిన జిల్లా మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఇంచార్జి మంత్రి కొండా సురేఖ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. గెలుపు ఓటముల తో సంబందం లేకుండా నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళతానని తెలిపారు. నిధులు మంజూరు అయిన అభివృద్ది పనులను  ఈ నెల 8 న ప్రారంభించడం జరుగుతుందన్నారు.
శ్రీనివాస్ రెడ్డి ని సన్మానించి కుల సంఘాల నాయ కులు: మండలంలోనీ తొగుట, ఎల్లారెడ్డి పేట, కాన్గ ల్ గ్రామాలకు కుల సంఘాల భవనాలకు నిధుల మంజూరు పట్ల ఆయా గ్రామల కుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం  చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని శాలువతో ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతా నరేం దర్ రెడ్డి,  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, మాజీ ఎంపీపీ గంట రేణుక రవీందర్, ఎల్లారెడ్డి పేట మాజీ సర్పంచ్ బుర్ర అనిత నర్సిం లు, తొగుట మండల నాయి బ్రామ్మన అధ్య క్షులు పయ్యావుల శ్రీనివాస్, తొగుట గ్రామ అధ్య క్షులు పయ్యావుల కరుణాకర్, ఉపాధ్యక్షులు పయ్యా వుల సురేష్, గ్రామ నాయి బ్రామ్మన సభ్యులు అశోక్, అనిల్, కిష్టయ్య శంకర్, హరీష్, సాయి కిరణ్, అజయ్ రాజు, బాలయ్య, వెంకటేష్, సోమ గారి కొండల్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ముడికే స్వామి, కాన్గల్ గ్రామం యాదవ సంఘం, ఎస్సీ మాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love